Breaking News

రామ్- లక్ష్మణ్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌

Published on Sat, 06/10/2023 - 12:07

టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ ఫైట్‌ మాస్టర్స్‌ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు రామ్- లక్ష్మణ్. సినీ పరిశ్రమలో బీజీగా ఉండే వారిద్దరు ఖాళీ టైమ్‌ దొరికితే  చాలు  సొంత గ్రామమైన చీరాల చేరుకుంటారు . అక్కడ వారు సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ బ్రదర్స్‌ తమ మానవత్వాన్ని చాటుకున్నారు.  చీరాలలో ఉండే 'కోటయ్య వృద్ధాశ్రమం' కోసం ఈ బ్రదర్స్‌ జోలి పట్టి బిక్షాటన చేశారు. 

(ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. రిజిస్ట్రేషన్‌ ఇలా చేయండి)

వృద్ధాశ్రమానికి ఒక ఆటో అవసరం కావడంతో చీరాలలోని ప్రధాన రహాదారుల్లో  బిక్షాటన చేసి.. ప్రజలు నుంచి నగదు సేకరించారు. వచ్చిన డబ్బుతో పాటు వారు కూడా కొంత డబ్బును కలిపి  ఆశ్రమానికి అందించారు. అదేంటి..? సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారు కదా? సొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా? ఇదంతా ఎందుకు అని ప్రశ్నించే వారికి ఇలా సమాధానం చెప్పారు. 'ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాము.'మానవసేవే మాధవసేవ' అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి.అపుడే సమాజం బాగుంటుంది' అని అన్నారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు.  వారు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ.. ఫ్యాన్స్‌తో పాటు పలువురు షోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

(ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్‌ హీరోయిన్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)