Breaking News

'ఇలాంటివి ఇండియాలో కూడా దొరికితే'.. పూరి జగన్నాధ్ ఆసక్తికర సందేశం

Published on Fri, 12/27/2024 - 19:25

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చివరిసారిగా డబుల్ ఇస్మార్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్య థాపర్‌ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మించారు.

ఇక సినిమాల విషయం పక్కనపెడితే పూరి జగన్నాధ్ తన మోటివేషనల్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీటిని విడుదల చేస్తుంటారు. ఇటీవల వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ తాజాగా మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో అభిమానులను పలకరించారు. అదేంటో మీరు చూసేయండి.

అమెరికాకు చెందిన ప్రముఖ డిజైనర్‌ ఏంజెలా లూనా తయారు చేసిన జాకెంట్ గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. మనదేశంలో ఎలాంటి నీడ లేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరైనా ఇండియాలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తే ఎందరో అభాగ్యులకు మేలు చేసిన వారవుతారని వీడియోలో మాట్లాడారు.

పూరి జగన్నాధ్ తన మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' యుద్ధాల కారణంగా ఇంటిని వదిలి కట్టుబట్టలతో పెళ్లాం పిల్లలను తీసుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇతర దేశాల్లో వీరికి ఇల్లు అనేదే ఉండదు. ముఖ్యంగా నైజీరియా, హోండురస్‌, ఇరాక్‌, సూడాన్‌, ఇండియా, చైనా, ఇథియోపియా, కాలిఫోర్నియా, న్యూయార్క్‌ ఫ్లోరిడాలో ఇల్లులేని వాళ్లు  చాలా మంది ఉన్నారు. ఇండియాలో 4 కోట్ల మంది అడుక్కు తినేవాళ్లున్నారు.  ప్రపంచ జనాభాలో ఐదుశాతం మందికి ఇల్లులేదు. వీళ్ల కష్టాలు వర్ణనాతీతం.

కొంతమంది వడదెబ్బ, తీవ్రమైన చలికి తట్టుకోలేక చనిపోతున్నారు. ఇల్లు వాకిళ్లు వదిలేసి ఒక మనిషి, తనకు అవసరమైనవి మాత్రమే తీసుకుని ఒక బ్యాగ్‌లో వేసుకుని బయలు దేరాల్సి వస్తే ఏం వేయాలో తెలియదు. దేన్నీ వదులుకోలేం. అలాంటి బ్యాగ్‌ చాలా బరువుగా ఉంటుంది. దాన్ని పట్టుకుని మోసుకుంటూ నడవాలంటే ఎంత కష్టం. బట్టలు, గిన్నెలు, స్టవ్‌ చాలా బరువు ఉంటాయి. ఆఖరికి దుప్పటి పట్టుకెళ్లాలన్న కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. ఇక టెంట్‌ను మోసుకువెళ్లే శక్తి ఉండదు' అని మాట్లాడారు.


పూరి చెబుతూ.. 'ఇలాంటి వారు వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇలాంటి వారి కోసం న్యూయార్క్‌కు చెందిన ఏంజెలా లూనా అనే డిజైనర్‌ అద్బుతమైన ఐడియాతో సరికొత్త జాకెట్‌ చేసింది. దాని పేరే జాకెంట్‌. జాకెట్‌ను, టెంట్‌ను కలిపి చేసిన డిజైన్‌. దీన్ని మీరు జాకెట్‌లా వేసుకోవచ్చు. అలా ఎక్కడైనా పడుకోవాల్సి వస్తే.. టెంట్‌గా మారిపోతుంది. ఇది ఎంతో మంది సిరియా శరణార్థులను కాపాడింది. చాలా మంది డిజైనర్లు సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్లకోసం కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తారు. వాటన్నింటి కంటే గ్రేట్‌ డిజైన్‌ ఇది. ఒక్కసారి మీరు గూగుల్ చేసి  ఏంజెలా లూనా జాకెంట్‌ డిజైన్ చూడండి. దీన్ని అందరూ ప్రశంసించాలి. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అయిే ఈ జాకెంట్‌ ఇండియాలోకి రాలేదు. ఇలాంటివి మనదేశంలో వస్తే అడక్కునేవాళ్లకు దుప్పట్లు గిప్ట్‌గా ఇవ్వొచ్చు. ఏదైనా కంపెనీ వీటిని ఇండియాలో వీటిని పరిచయం చేస్తే బాగుంటుందని ఆశ. ఇదే ఐడియాను తీసుకుని తయారు చేసినా, సంతోషమే. ఎంతో మందిని కాపాడిన వాళ్లు అవుతారు. త్వరలోనే జాకెంట్‌ భారత్‌లో దొరుకుతుందని ఆశిస్తున్నా'‍అని  అన్నారు.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)