Breaking News

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో సినీ ప్రముఖులు

Published on Mon, 12/23/2024 - 13:04

సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలుస్తారని ఆయన తెలిపారు. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'డాకు మహారాజ్' ప్రమోషన్స్‌ కార్యక్రమంలో ఆయన మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.

సంధ్య థియేటర్‌ ఘటనతో బెనిఫిట్‌ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు కదా.. మరీ మీరు నిర్మించిన డాకు మహారాజ్ పరిస్థితి ఏంటి అని నాగవంశీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. గేమ్‌ ఛేంజర్‌ ప్రమోషన్‌ కార్యక్రమం నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరిగొచ్చాక సీఎంను కలుస్తాం.  ఆ సమయంలో టికెట​్‌ ధరల పెంపుతో పాటు ప్రీమియర్‌ షోలపై చర్చ చేస్తామని ఆయన అన్నారు. నా సినిమా డాకు మహారాజ్‌ కంటే ముదే దిల్‌ రాజ్‌ గేమ్‌ ఛేంజర్‌ విడుదల అవుతుంది. కాబట్టి, టికెట్ల ధరల విషయంలో ఆయన ఏం తేలుస్తారో అందరికీ అదే వర్తిస్తుంది' అని నాగవంశీ అన్నారు. తాము కూడా అన్ని సినిమాలకు టికెట్‌ ధరలు పెంచమని అడగమన్నారు. ఏ సినిమాకు అయితే టికెట్‌ ధర పెంపు అవసరమో వాటికి మాత్రమే అడుగుతామని వంశీ అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లతో సినీ ప్రముఖుల భేటీ గురించి తనకు తెలియదని నాగవంశీ తెలిపారు. ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్లిపోతుందని టాక్‌ వినిపిస్తోంది కదా..? అనే ప్రశ్నకు ఆయన ఇలా అన్నారు. 'నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకున్నా.. అలాంటప్పుడు మరోచోటకు ఎందుకు వెళ్తాను. ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల సపోర్ట్‌ ఇండస్ట్రీకి వుంది.' అని  ఆయన అన్నారు.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)