Breaking News

కేపీ చౌదరి ఆత్మహత్య.. టాలీవుడ్ నటి కూతురు ఎమోషనల్ నోట్

Published on Mon, 02/03/2025 - 17:00

టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్యపై ‍ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. అతనితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక్కడ సమాజం విఫలమైందని.. నిన్ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అన్న అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇక నుంచి నా బాధలు ఎవరికీ చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. నీ బాధలు కూడా వినడానికి లేకుండా చేశావ్ కదా అన్న అంటూ సుప్రీత తన నోట్‌లో రాసుకొచ్చింది.

నీకోసం చెల్లి ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది.. వెనక్కి వచ్చేయ్ అన్న అంటూ తన బాధను వ్యక్తం చేసింది. 'మిస్ యూ కేపీ అన్న.. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పులిలాగే ఉంటావ్.. ఐ లవ్ యూ సో మచ్.. రెస్ ఇన్ పీస్' అంటూ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: 'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే)

కాగా.. కేపీ చౌదరి  నిర్మాతగా కబాలి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించారు. కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే గతేడాదిలో డ్రగ్స్‌ కేసులో సైబరాబాద్‌ పోలీసులు  ఆయన్ను పట్టుకున్నారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)