Breaking News

'విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌ టీజర్'.. రష్మిక పోస్ట్ వైరల్!

Published on Wed, 02/12/2025 - 18:20

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్‌డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌ను అందించారు. ఈ మాస్ యాక్షన్‌ థ్రిల్లర్‌ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కింగ్‌డమ్‌ టీజర్‌ పోస్టర్‌ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్‌ సమ్‌థింగ్‌ మెంటల్‌.. విజయ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..

టాలీవుడ్‌లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్‌కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్‌డమ్‌ టీజర్‌ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)