అసలు నేను సినిమాలో ఉన్నానా?.. డైరెక్టర్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన లయ!

Published on Sun, 05/04/2025 - 18:13

రాబిన్‌హుడ్ తర్వాత నితిన్ ‍హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్‌ వేణు శ్రీరామ్ బర్త్‌ డే సందర్భంగా షేర్ చేసిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.

డైరెక్టర్‌ వేణు శ్రీరామ్ పుట్టినరోజు కానుకగా తమ్ముడు మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ‍అయితే ఈ విషయాన్ని ఓ వీడియో  రూపంలో వెల్లడించారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ దగ్గరికి వచ్చిన హీరోయిన్లు బర్త్‌ డే విషెస్‌కు బదులుగా మూవీ రిలీజ్‌ డేట్ ఎప్పుడు సార్?అని అడుగుతారు. దీంతో ఆయన కాస్తా షాకింగ్‌కు గురవుతారు. హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మతో పాటు మరో సీనియర్‌ టాలీవుడ్ హీరోయిన్ లయ కూడా దర్శకుడితో మూవీ విడుదల తేదీ గురించే ఆరా తీస్తుంది.

అసలే నేను తెలుగమ్మాయిని.. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నా.. నేను ఈ సినిమాలో ఉన్నానా సార్? అంటూ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ను ప్రశ్నిస్తుంది. 'ఒక్క పోస్టర్‌ లేదు.. అప్‌డేట్‌ లేదు.. కనీసం సినిమా రిలీజ్‌ డేట్‌ అయినా చెప్పండి.. వెళ్లి థియేటర్లోనే చూసుకుంటా' అని లయ మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్‌ మూవీ ప్రమోషన్లలో ఇదొక డిఫరెంట్‌ వే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. వేణు శ్రీరామ్- నితిన్ కాంబోలో వస్తోన్న తమ్ముడు మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో దిల్‌రాజు, అల్లు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాబిన్‌ హుడ్‌ మూవీ హిట్ కాకపోవడంతో నితిన్ ఫ్యాన్స్‌ తమ్ముడిపై ఆశలు భారీగానే పెట్టుకున్నారు. మరీ వారి అంచనాలకు తగినట్లుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే జూలై 4వరకు వేచి చూడాల్సిందే.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)