అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్

Published on Sun, 05/18/2025 - 19:42

టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

తాజాగా తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత ​​లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్‌లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.

నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మా నాన్న గారి నుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయం గురించి అనసూయ రాసుకొచ్చింది. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో ఉన్నా జైహనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయగలను అని తండ్రి చెప్పేవారని తెలిపింది. నా తండ్రి తర్వాత తండ్రిగా భావించేది ఆ హనుమంతుడినే.. అందుకే నా పెద్ద కొడుకుకు శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం అని వివరించింది.   ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అగ్ని దేవుడు (దూత) అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైన గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారానే చెప్పుకుంటాం.. ఈ విధంగా ఆ రోజు నా  హనుమాన్ మా ఇంటి పేరుని.. మా ఇంటికి ఆహ్వానించాడనికి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేసింది.  అందరు ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందని అనసూయ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)