'కొందరు కావాలనే నాపై కుట్ర': అనసూయ

Published on Fri, 08/14/2026 - 17:31

టాలీవుడ్ నటి అనసూయ పేరు మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న అనసూయ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా వివాదాలతో కాదు. సనాతన ధర్మంపై ఆమె చేసిన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది. అనసూయ సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చింది. 

కొందరు తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని పేర్కొంది. తాను ఏ మత విశ్వాసాలనూ కించపర్చేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. తాను మాట్లాడింది కేవలం కొందరి గురించి మాత్రమేనని తెలిపింది. తనపై వల్గర్ కామెంట్స్.. పర్సనల్ ఎటాక్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే వాళ్ల గురించి అని తన పోస్ట్‌లో వెల్లడించింది. అందుకే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని అనసూయ రాసుకొచ్చింది.

అనసూయ తన పోస్ట్‌లో రాస్తూ..'కొందరు కావాలనే నా మాటలను వక్రీకరిస్తున్నారు. అందుకే నేను వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను కొందరి గురించి మాత్రమే మాట్లాడా. నాపై అభ్యంతర కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే వాళ్ల గురించి మాత్రమే చెప్పా. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ కించపరచలేదు. నన్ను టార్గెట్‌ చేస్తున్న వాళ్లకు స్పష్టంగా చెప్పాలనుకుటున్నా. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని. నా ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల నాకు ఎలాంటి చింత లేదు. ధైర్యంగా ఉండటం.. నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం.. ఇవన్నీ నాకు ధర్మమే నేర్పింది. నన్ను నేను హనుమాన్‌ జీ కుమార్తెగా భావిస్తా. ఆయన బలమే నాకు స్ఫూర్తి' అంటూ పోస్ట్ చేసింది. 

అంతేకాకుండా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండటం నా నైజం కాదని తెలిపింది. నా మాటల్లో అసలు విషయం పక్కనపెట్టి.. సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా వక్రీకరించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది. మతం ఆధారంగా నేను ఎవరిపైనా ఓ నిర్ణయానికి రాను. నన్ను వేధించే వాళ్లను మాత్రమే ప్రశ్నిస్తానని రాసుకొచ్చింది. అందువల్ల ఎడిట్‌ చేసిన క్లిప్‌లు, సగం సగం కథనాలు చూసి మోసపోవద్దని సుదీర్ఘ పోస్ట్‌ చేసింది.

 

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)