Breaking News

క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్

Published on Fri, 02/14/2025 - 10:45

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉంది.  గతేడాది పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్‌ హోల్మ్స్‌, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను మెప్పించింది. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సిన అనన్య నాగళ్లకు ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. తన బ్యాగేజ్‌ ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మీరు ఇంత సింపుల్‌గా సారీ చెప్తే సరిపోతుందా అంటూ విమానసంస్థ కస్టమర్‌ కేర్‌ వారితో ఫోన్‌లో మాట్లాడింది. మీరు ఆలస్యం చేయడం వల్ల దాదాపు 2 వేల మంది విద్యార్థులు నాకోసం వేచి ఉండాల్సి వచ్చిందని ఓ వీడియోను షేర్ చేసింది.

అనన్య తన ట్వీట్‌లో రాస్తూ..'నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మధురైకి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నా. నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పుడు వారు సింపుల్‌గా క్షమించండి అని చెబుతున్నారు. నా బ్యాగ్‌ను తర్వాత అందుబాటులో ఉన్న విమానంలో పంపుతారట. ఇది ఆమోదయోగ్యం కాదు. మీకో రూల్, మాకో రూల్ ఎందుకు ఉన్నాయి. ప్యాసింజర్ ఒక నిమిషం ఆలస్యం అయితే..  అనుమతించలేమని మీరు చెబుతారు. ఇప్పుడేమో 6 గంటల లగేజీ ఆలస్యం జరిగింది. దీని కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదంటూ విమానయాన సంస్థ కస్టమర్‌ కేర్‌కు ఇచ్చిపడేసింది డార్లింగ్ బ్యూటీ'.

కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత  పవన్​ కల్యాణ్​ చిత్రం 'వకీల్​ సాబ్'​తో మరింత ఫేమస్​ అయింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలతో అభిమానులను మెప్పించింది.
 

 

Videos

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!