Breaking News

'కోడిని చూస్తూ చికెన్ తినడం'.. ఆ రోల్ కోట చేయాల్సింది కాదు!

Published on Sun, 07/13/2025 - 14:56

తెలుగు సినీ ప్రియులను వెండితెరపై అలరించిన కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రాణం ఖరీదు మూవీతో మొదలైన ఆయన జర్నీ.. వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయనలా హాస్యం పండించడం, విలనిజం చూపించడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో అన్నంతలా తనలోని విలక్షణ నటనను వెండితెరపై చూపించారు. అయితే ఆయన చేసిన సినిమాల్లో అహ నా పెళ్లంట చిత్రానికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

ఈ చిత్రంలో ఆయన చేసిన ఓ సీన్‌ ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుని గుర్తుండిపోయేలా ఉంటుంది. అది మరేదో కాదు.. కోటా శ్రీనివాసరావు నటించిన అహ నా పెళ్లంట చిత్రంలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర. ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించారు. ఇందులో కోట తన పాత్రలో ఒదిగిపోయారు. బ్రహ్మానందంతో కలిసి ఆయన పండించిన కామెడీ చూస్తే నవ్వకుండా ఉండలేరు. అంతలా ఆ పాత్రలో మెప్పించారాయన.

కానీ ఆ పాత్రకు మొదట అనుకున్నది కోటాను కాదట. కథ రాసుకున్నప్పుడు లక్ష్మీపతి పాత్ర కోసం రావుగోపాలరావును అనుకున్నారట. అయితే అప్పటికే కోటా శ్రీనివాసరావు నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల కావడంతో ఆ రోల్‌ను కోటతోనే చేయించాలని జంధ్యాల నిర్ణయించుకున్నారట. కానీ నిర్మాత డి.రామానాయుడు మొదట అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఆ తర్వాత పట్టుబట్టి మరి ఆయనను ఒప్పించారట.

Kota Srinivasa Rao: ఏం యాక్టింగ్ గురు.

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)