అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
కల్కి మూవీ సక్సెస్.. పార్టీ చేసుకున్న జగపతిబాబు!
Published on Sun, 07/21/2024 - 15:15
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. సలార్‌లో రాజమన్నార్‌గా తనదైన నటనతో మెప్పించారు. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన జగ్గుభాయ్.. ప్రస్తుతం పుష్ప-2, కంగువా లాంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా.. విదేశాల్లో, షూటింగ్స్‌లో ఏక్కడ ఉన్నా తన అనుభవాలను పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మందు బాటిల్ కలుపుతూ కనిపించారు. ప్రభాస్, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు.
Darling Prabhasa ki, Kalki team ki Cheers. 🥂 #Kalki2898AD #Prabhas pic.twitter.com/qFoJhAcQ4b
— Jaggu Bhai (@IamJagguBhai) July 21, 2024
Tags : 1