Breaking News

బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్

Published on Tue, 12/03/2024 - 19:57

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తిరుపతి ప్రకాశ్‌. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్‌ అందరితో కలిసి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తప్ప దాదాపు అందరితో సినిమాలు చేశానని వెల్లడించారు. ప్రస్తుతం సీరియల్స్‌లో చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్‌లో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.

తాను సినిమాల్లో నటించే రోజుల్లో బండ్ల గణేశ్‌, తాను ప్రాణ స్నేహితులమని ప్రకాశ్ తెలిపారు. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేశ్ నిర్మాత అయ్యాక ఆయన సినిమాల్లో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు డేట్స్ తీసుకుని నాకు అబద్ధం చెప్పారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.

తిరుపతి ప్రకాశ్ మాట్లాడుతూ..'బండ్లగణేశ్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ‍అయితే ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. రోజుకు 15 వేల పారితోషికం ఖరారు చేసుకున్నా. దీంతో వేరే సినిమాలకు నో చెప్పా. వినాయకచవితి పండగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్లాలి. కానీ షూట్‌కు బయలుదేరాల్సిన ముందురోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. దీంతో షాక్ తిన్నా. మూడు సినిమాలు వదిలేశా. మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెంటనే రాజమండ్రికి వెళ్లా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాశ్ అన్న మంచి సినిమా వదిలేశావ్ అన్నాడు. ఏ సినిమా అని అడిగా.  కల్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. అప్పుడు నాకు బండ్ల గణేశ్‌పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును అని చెప్పి వెంటనే పెట్టేశా' అని అన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)