Breaking News

అనారోగ్యంతో కమెడియన్‌.. టాలీవుడ్ నటుడి సాయం

Published on Mon, 10/26/2026 - 20:07

టాలీవుడ్ నటుడు అయినాబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్రకు అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. తన వంతు సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామచంద్రకు  ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రామచంద్ర త్వరగా కోలుకునేందుకు తెలుగు సినీనటులు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.

సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి రామచంద్రకు అండగా నిలవాలని  దశరధ విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు మరింత సహాయం అందించే దిశగా ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. దశరధ చేసిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. దశరధ వెండితెర ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 30న విడుదల కానున్న ‘కిల్లర్’ సినిమా ఘనవిజయం సాధించాలని రామచంద్ర శుభాకాంక్షలు తెలిపారు.

 

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)