Breaking News

నెగెటివ్‌ కామెంట్స్‌.. హర్టయిన అనుపమ, అందుకే డుమ్మా!

Published on Thu, 03/28/2024 - 08:29

హీరోయిన్‌ అన్నాక అన్ని రోల్స్‌ చేయాలి. బరి గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్‌ బోల్డ్‌ పాత్రలకు ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్‌లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. అనుపమ కూడా ఇలా తయారైందేంటని కోపంతో ఊగిపోయారు. ఇవన్నీ అవసరమా? అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలు చేస్తే బోర్‌ కొడుతుంది కదా.. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పినా ఫ్యాన్స్‌ ఆవేశం చల్లారలేదు. తనను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు.

ఇబ్బంది పెట్టొద్దు
బుధవారం (మార్చి 27న) టిల్లు స్క్వేర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి అనుపమ డుమ్మా కొట్టింది. దీనిపై స్టేజీపైనే స్పందించాడు సిద్దు జొన్నలగడ్డ. అతడు మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్‌ నుంచి లేటెస్ట్‌గా ఓ పోస్టర్‌ రిలీజైంది. దానికింద చాలా కామెంట్స్‌ చేశారు. ఒక అమ్మాయి గురించినే ఏది పడితే అది అనేయడం అనడం కరెక్ట్‌ కాదు! మీకు మాట్లాడే హక్కు ఉంది.. నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్‌ చేస్తే అవతలివాళ్లు ఎంజాయ్‌ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. 

హర్ట్‌ అవడం వల్లే?
తన గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్‌ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే దయచేసి వల్గర్‌గా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. నెగెటివ్‌ కామెంట్స్‌కు హర్ట్‌ అయినందువల్లే అనుపమ ఈవెంట్‌కు రాలేదని తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్‌ మార్చి 29న రిలీజ్‌ కానుంది.

చదవండి: లండన్‌లో కొత్త ఇల్లు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)