Breaking News

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో!

Published on Thu, 07/04/2024 - 12:25

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ మంచి మనసు చాటుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న సినిమా టెక్నీషియన్‌ రవి కుమార్‌కు ఆర్థిక సాయం చేశాడు. టైగర్‌ ష్రాఫ్‌ తొలి సినిమా 'హీరోపంతి'కి రవి కుమార్‌ ఫోకస్‌ పుల్లర్‌ (అసిస్టెంట్‌ కెమెరామన్‌)గా పని చేశాడు. తాజాగా రవి కుమార్‌ మాట్లాడుతూ.. టైగర్‌ ష్రాఫ్‌ తండ్రి జాకీ ష్రాఫ్‌తో మా అన్న ప్రసాద్‌ కలిసి పని చేశాడు. 1942: ఎ లవ్‌ స్టోరీ సినిమా షూటింగ్‌ సమయంలో మా అన్న చేయి ఫ్రాక్చర్‌ అయింది. అప్పుడు ఆపరేషన్‌కు జాకీ సర్‌ సాయం చేశాడు.

అప్పుడు ఆయన.. ఇప్పుడు..
ఇప్పుడు ఆయన కుమారుడు నాకు సాయపడ్డాడు. నేను హీరోపంటి సినిమాకు వర్క్‌ చేశాను. అలా ఆయన నాకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. టైగర్‌ తల్లి ఆయేషా ష్రాఫ్‌ నాకు మంగళవారం ఫోన్‌ చేసి మాట్లాడింది. టైగర్‌ ఫస్ట్‌ సినిమాకు నేను పని చేశానని బహుశా తనకు గుర్తుండకపోవచ్చు. అయినా మంచి మనసుతో నన్ను ఆదుకున్నాడు అని తెలిపాడు.

దాచుకుందంతా అయిపోయింది
కాగా రవి కుమార్‌ పని చేస్తున్న పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ నుంచి ఇంకా జీతం అందలేదని తెలుస్తోంది. ఓ పక్క రావాల్సిన డబ్బు ఆగిపోగా, మరోపక్క యాక్సిడెంట్‌ వల్ల ఎనిమిది నెలలపాటు మంచానికే పరిమితమైన పరిస్థితి! దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోవడంతో సాయం కోసం ఎదురు చూశాడు. ఇంతలోనే టైగర్‌ ష్రాఫ్‌ పెద్ద మనసుతో అతడి చికిత్సకు, ఆర్థిక అవసరాలకు సరిపడా డబ్బు సమకూర్చాడు. అది లక్షల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

చదవండి: ఆ స్టార్‌ హీరోల ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ను కొట్టేసిన ప్రభాస్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)