Breaking News

అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం!

Published on Fri, 06/28/2024 - 12:52

భారీ బడ్జెట్‌ సినిమాలు క్లిక్కయితే లాభాల వరద పారుతుంది.. తేడా వచ్చిందంటే మాత్రం రక్తకన్నీరు కారుతుంది. చాలా సినిమాల విషయంలో ఇది రుజువైంది కూడా! బాలీవుడ్‌ బ్యానర్‌ పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నానీ, తన తండ్రి వాసు భగ్నానీతో కలిసి ఈ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు.

రూ.250 కోట్ల అప్పు.. అయినా..
ఈ బ్యానర్‌లో ఇటీవల బడే మియా చోటే మియా, గణపత్‌ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండూ బాక్సాఫీస్‌ వద్ద గట్టెక్కలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ రూ.250 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్యానర్‌లో అక్షయ్‌ కుమార్‌ నటించిన నాలుగు సినిమాలకుగానూ అతడికి రూ.165 కోట్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది. అది కూడా కంపెనీపై అధిక భారానికి కారణమైందన్నది చర్చ! తాజాగా దీనిపై నిర్మాత సునీల్‌ దర్శన్‌ స్పందించాడు.

అప్పట్లో సక్సెస్‌..
మీరు అనుకుంటున్న మొత్తానికి కాస్త అటూఇటుగా హీరో టైగర్‌ ష్రాప్‌కు రెమ్యునరేషన్‌ చెల్లించాం. అయితే అదెంత అనేది బయటకు చెప్పలేను. కానీ ఓ విషయం చెప్పాలి.. 1990'స్‌లో వాసు భగ్నానీ.. డేవిడ్‌ దావణ్‌తో కలిసి అర డజను సినిమాలు చేసి సక్సెస్‌ రుచి చూశాడు. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి! ఇప్పుడు వారి స్ట్రాటజీలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌కు ఎంత ఇచ్చారన్నది మాత్రం బయటపెట్టలేదు. ఇకపోతే పూజా బ్యానర్‌లో అక్షయ్‌ కుమార్‌.. బడే మియా చోటే మియా, బెల్‌ బాటమ్‌, మిషన్‌ రాణిగంజ్‌, కట్‌పుత్లి సినిమాలు చేశాడు.

చదవండి: 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)