దేవుడి పాట నాదే

Published on Wed, 10/04/2023 - 00:34

‘గుంటూరు రైల్వే స్టేషన్‌.. దేవుడి పాట పాతికవేలు’ అంటూ వేలం పాటతో మొదలైంది ‘టైగర్‌ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్‌. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ముంబైలో ‘టైగర్‌ నాగేశ్వర రావు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. పోలీసులకు విజ్ఞప్తి.. కాకినాడ నుంచి మదరాసు వెళ్లు సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ దారిలో దోపిడీకి గురి కాబోతోంది’, ‘కొట్టే ముందు.. కొట్టేసే ముందు వార్నింగ్‌ ఇవ్వడం నాకు అలవాటు’, ‘రేపటి నుంచి స్టూవర్టుపురంలో దేవుడి పాట నాదే.. చెప్పు.. వాడికి’ అంటూ రవితేజ చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి.

ముంబైలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో పాల్గొన్న రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి రావడం హ్యాపీగా ఉంది. హిందీలో నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అభిషేక్‌ అగర్వాల్, వంశీ, నటీనటులు రేణూ దేశాయ్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్‌ ఖేర్, జిషు సేన్‌ మాట్లాడారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)