Breaking News

‘థగ్‌ లైఫ్‌’ కోసం భారీ రెమ్యునరేషన్‌.. కమల్‌, త్రిష, శింబు ఎంతెంత తీసుకున్నారంటే?

Published on Wed, 06/04/2025 - 16:32

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’(Thug Life). కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, పంకజ్ త్రిపాఠి, సాన్య మల్హోత్రా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘నాయకుడు’ తర్వాత కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. 

38 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్‌ అవుతుండడంతో థగ్‌ లైఫ్‌పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. ప్రమోషన్స్‌కి కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే బడ్జెట్‌లో ఎక్కువ భాగం నటీనటుల రెమ్యునరేషన్‌కే వెళ్లిందట. ఈ చిత్రానికి కమల్‌ నిర్మాతగా వ్యవహరించాడు. మణిరత్నం కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వీరిద్దరు పారితోషికాలు తీసుకోకుండా లాభాల్లో వాటాలను తీసుకోవాలని ఫిక్స్‌ అయ్యారట.

 ఇక ఈ సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్‌ శింబుకి ఇచ్చారట. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. దీంతో రూ. 40 కోట్ల పారితోషికం ఇచ్చి మరీ శింబుని ఆ పాత్రకు తీసుకున్నారట.ఇక హీరోయిన్‌గా నటించిన త్రిష కూడా భారీగానే తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు గాను రూ. 12 కోట్ల పారితోషికం పుచ్చుకుందట. గత సినిమాతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. 

అలాగే ఇతర కీలక పాత్రలో నటించిన అశోఖ్‌ సెల్వన్‌, బోజు జార్జ్‌ కోటి రూపాయల చొప్పున పారితోషికంగా తీసుకున్నారు.  ఇక మరో కీలక పాత్రలో నటించిన అభిరామి రూ. 50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లతో కలిపి మొత్తం ఈ సినిమాకు రూ. 300 కోట్ల బడ్జెట్‌ అయిందట.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Videos

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు