Breaking News

సల్మాన్‌ను లేపేస్తాం అంటూ వార్నింగ్‌.. పోలీసుల అదుపులో నిందితుడు

Published on Tue, 04/15/2025 - 12:18

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని గంటల్లోనే ఆ మెసేజ్‌ పంపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరించిన వ్యక్తి గుజరాత్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. అతనొక మానసిక రోగి అంటూ వారు పేర్కొన్నారు. సల్మాన్‌ను హత్య చేస్తామంటూ ఇప్పటికే చాలామంది హెచ్చరించారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి  కొంతకాలంగా వార్నింగ్స్‌ వస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులకు పెద్ద తలపోటుగా మారింది.

సల్మాన్‌ను చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు సోమవారం ఒక మెసేజ్‌ వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని అందులో ఉంది.. లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని వాట్సప్‌ ద్వారా మెసేజ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు అతన్ని కొన్ని గంటల్లోనే పట్టకున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)