Breaking News

తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్‌.. రచయిత ఎమోషనల్‌

Published on Mon, 02/24/2025 - 12:51

డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) మంచితనం గురించి అందరికీ తెలుసు. సెట్‌లోని వారికి ఇంటిభోజనం తెచ్చి కడుపు నిండే ఈయన ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నాడు. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నాడు రచయిత తోట ప్రసాద్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2010 ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తూ అదేరోజు ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజు (Uppalapati Surya Narayana Raju) కన్నుమూశారు. అది పన్నెండవ తారీఖు అనుకుంటాను!

తండ్రిని కోల్పోయిన బాధలోనూ..
తండ్రి మరణంతో శోకంలో మునిగిపోయిన ఆయన.. నేను ఆస్పత్రిలో ఉన్నానన్న విషయం తెలిసి నాకోసం ​కొంత డబ్బు పంపించారు. నాపై అంత శ్రద్ధ తీసుకున్నారు. ఎవరైనా తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించరు. అందులోనూ తండ్రిని కోల్పోవడం అంటే మామూలు బాధాకర విషయం కాదు. అటువంటి పరిస్థితిలోనూ ఆయన.. నా సినిమా రచయిత అని నన్ను సొంత మనిషిగా భావించి వెంటనే స్పందించారు. 

కన్నప్ప ద్వారా..
ప్రభాస్‌.. అంతటి మంచి వ్యక్తి. చాలాకాలం తర్వాత కన్నప్ప మూవీ ద్వారా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది అని ఎమోషనలయ్యాడు. ప్రభాస్‌ బిల్లా సినిమాకు ప్రసాద్‌ సహరచయితగా పనిచేశాడు. ఇకపోతే ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి 'రాజా సాబ్‌', హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమాల్లో నటిస్తున్నాడు. అనంతరం స్పిరిట్‌, సలార్‌ 2, కల్కి 2 చిత్రాలు పట్టాలెక్కించనున్నాడు.

చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు