ఆఫీస్‌లో చోరీ.. వీడియో రిలీజ్‌ చేసిన నటుడు

Published on Fri, 06/21/2024 - 08:22

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఆఫీస్‌లో దొంగలు పడ్డారు. ఓ సినిమా నకలుతోపాటు విలువైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. రూ.4 లక్షల నగదు సైతం దొంగిలించారు. ఈ ఘటనపై అనుపమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ వీడియో షేర్‌ చేశాడు. 'నిన్న రాత్రి ముంబైలోని వీర దేశాయ్‌ రోడ్‌లో ఉన్న నా ఆఫీసులో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించి విలువైన పత్రాలను దొంగతనం చేశారు. 

సీసీటీవీలో..
వాటిని నాశనం చేయరని ఆశిస్తున్నాను. అలాగే మా కంపెనీ నిర్మించిన ఓ సినిమా నెగెటివ్స్‌ కూడా మాయం చేశారు. ఆ ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేముందు నా ఆఫీసులో పనిచేసేవారు తీసిన వీడియో ఇది' అని చెప్పుకొచ్చాడు.

సినిమా..
కాగా ది కశ్మీర్‌ ఫైల్స్‌తో సెన్సేషన్‌గా మారిన అనుపమ్‌ ఖేర్‌.. ఇటీవల ఐబీ71, ద వ్యాక్సిన్‌ వార్‌, కుచ్‌ ఖట్టా హో జాయే, కాగజ్‌ 2 వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మెట్రో.. ఇన్‌ డినో, తన్వి ద గ్రేట్‌ అనే మూవీస్‌లో నటిస్తున్నాడు.

 

 

చదవండి: దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే?

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)