Breaking News

సెప్టెంబర్‌ మొదటి వారం రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలివే

Published on Mon, 08/30/2021 - 11:52

ప్రేక్షకులకు వినోదం పంచేందుకు అటు థియేటర్లు, ఇటు ఓటీటీలు రెండూ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఓటీటీలు కేవలం సినిమాల మీదే ఆధారపడకుండా వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింస్‌ పేరిట సొంత కంటెంట్‌ను అందిస్తూ యువతకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే థియేటర్‌లో రిలీజైన సినిమాలను వారం తిరిగేలోగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేస్తుండటం విశేషం. ఎప్పటిలాగే ఈవారం కూడా జనాలను ఎంటర్‌టైన్‌ చేసేందుకు కొత్త సరుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో థియేటర్‌, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలేంటో చూసేద్దాం..

101 జిల్లాల అందగాడు
బట్టతలతో బా​క్సాఫీస్‌ను కొల్లగొట్టడానికి వచ్చాడు నటుడు అవసరాల శ్రీనివాస్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. రుహానీ శర్మ హీరోయిన్‌. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 3న థియేటర్లలో విడుదల కానుంది.

డియర్‌ మేఘ
మేఘా ఆకాశ్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా డియర్‌ మేఘ. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 3న థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది.

ది కిల్లర్‌
కార్తీక్‌ సాయి, నేహా దేశ్‌పాండే, డాలీ షా ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ది కిల్లర్‌. చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యాదవ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై ఆవుల రాజు యాదవ్‌, సంకినేని వాసుదేవరావు నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌  మూవీ సెప్టెంబర్‌ 3న థియేటర్లలో విడుదలవుతోంది.

అప్పుడు ఇప్పుడు
సుజన్‌, తనీష్క్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అప్పుడు ఇప్పుడు. శివాజీ రాజా, పేరుపురెడ్డి శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. చలపతి పువ్వల డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను ఉషారాణి కనుమూరి, విజయ్‌ రామకృష్ణంరాజు నిర్మించారు. ఇది సెప్టెంబర్‌ మూడో తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అశ్మీ
రుషికా రాజ్‌, రాజ నరేంద్ర, కేశప్‌ దీపకప్‌, ఇందు కుసుమ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం అశ్మీ. శేష్‌ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సైతం సెప్టెంబర్‌ 3వ తేదీనే థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది.

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9
యాక్షన్‌ ప్రియులు ఎంతగానో ఇష్టపడే సిరీస్‌లో ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు సినిమాలు రిలీజై కాసుల పంటను కురిపించాయి. తాజాగా తొమ్మిదో సిరీస్‌ భారత ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. సెప్టెంబర్‌ 3న తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. విన్‌ డీజిల్‌, టైరీ గిబ్సన్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది.

ఇవి కాకుండా ఓటీటీలో వస్తున్న మరిన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
సిండ్రెల్లా - సెప్టెంబర్‌ 3

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
బ్లాక్‌ విడో - సెప్టెంబర్‌ 3
షాంఘ్‌ చి అండ్‌ ద లెజెండ్‌ ఆఫ్‌ ద టెన్‌ రింగ్స్‌ - సెప్టెంబర్‌ 3

నెట్‌ఫ్లిక్స్‌
స్పార్కింగ్‌ జాయ్‌ - ఆగస్టు 31
గుడ్‌ గర్ల్స్‌ - ఆగస్టు 31
మనీ హెయిస్ట్‌ 5వ సీజన్‌ - సెప్టెంబర్‌ 3

జీ5
హెల్మెట్‌ - సెప్టెంబర్‌ 3

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)