Breaking News

హీరోయిన్ 'మీటూ' కేసు కొట్టేసిన హైకోర్ట్

Published on Sat, 03/08/2025 - 20:16

దాదాపు ఆరేడేళ్ల క్రితం మీటూ(#Me too) ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా నడిచింది. పలువురు హీరోయిన్లు, నటీమణలు.. తమకెదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ హీరోయిన్ తనుశ్రీ దత్తా- నానా పాటేకర్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. 

ఏం జరిగింది?
హీరోయిన్ గా తనుశ్రీ దత్తాకు కాస్త గుర్తింపు ఉంది. తెలుగులోనూ బాలకృష్ణ 'వీరభద్ర' చిత్రంలో నటించింది. అసలు విషయానికొస్తే 2018లో ఈమె ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న టైంలో నానా పాటేకర్ సహా మరో ముగ్గురు తనని వేధించారని తనుశ్రీ ఆరోపించింది.

(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)

తనుశ్రీ బహిరంగంగానే ఈ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అప్పుడు కేసు కూడా నమోదు చేశారు. విచారణలో మాత్రం ఇలాంటిదేం జరగలేదని తేల్చారు. నటి ఆరోపణలన్నీ అవాస్తవాలని కోర్టుకి నివేదిక సమర్పించారు. దీనిపై 2019లో తనుశ్రీ దత్తా మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. 

చాలా వాయిదాల తర్వాత ఇప్పుడు కేసుపై ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో నానా పాటేకర్ కి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నానా పాటేకర్.. మహేశ్ బాబు-రాజమౌళి మూవీలో నటిస్తున్నారని సమాచారం.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు))

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)