Breaking News

తంగలాన్ రెడీ.. విడుదల ఎప్పుడంటే..?

Published on Mon, 07/01/2024 - 13:04

విక్రమ్‌ హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్  మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం విక్రమ్‌ ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టూడియో గ్రీన్, నీలమ్‌ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. కానీ, అప్పుడు కూడా ‘తంగలాన్ ’ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు.

తాజాగా తంగలాన్‌ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్‌ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వాయిదా పడింది. డిసెంబర్‌ 6న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. దీంతో తంగలాన్ సినిమాకు లైన్‌ క్లియర్‌ అయింది. 

బన్నీ ముందుగా ఫిక్స్‌ చేసుకున్న ఆగష్టు 15ను విక్రమ్‌ లాక్‌ చేయనున్నాడని సమాచారం. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తామని  పా. రంజిత్‌ తాజాగా తెలిపారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)