Breaking News

బాలీవుడ్‌ వైపు తంగలాన్‌.. విడుదల తేదీ ప్రకటన

Published on Sat, 08/24/2024 - 15:13

విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్‌. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సినీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. సుమారు రూ. 40 కోట్లకు పైగానే నెట్‌ కలెక్షన్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తెలుగు,తమిళ,కన్నడలో మాత్రమే విడుదలైన తంగలాన్‌ ఇప్పుడు హిందీలో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.

గోల్డ్ హంట్ నేపథ్యంలో  తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్. సౌత్‌ ఇండియా అభిమానులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతుంది. తాజాగా డైరెక్టర్‌ పా.రంజిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒక పోస్టర్‌తో ఈ విషయం తెలిపారు. 'బంగారు వీరుడు ఆగస్టు 30న ఉత్తర భారత దేశానికి  వస్తున్నాడు. ఈ ఎపిక్‌ స్టోరీని చూసేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.  కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


కథేంటి..?
1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)