Breaking News

రిలీజ్‌కు ముందు చిక్కుల్లో తంగలాన్ మూవీ!

Published on Tue, 08/13/2024 - 18:42

చియాన్ విక్రమ్ తాజాగా నటించిన భారీ యాక్షన్‌ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో విక్రమ్‌ విభిన్నమైన గెటప్‌లో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రయూనిట్ అంతా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.

అయితే రిలీజ్‌కు తంగలాన్ నిర్మాతకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తంగలాన్‌ మూవీ రిలీజ్‌కు ముందే రూ.1 కోటి రూపాయలు డిపాజిట్‌ చేయాలని నిర్మాతకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  సుందర్‌దాస్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అంతేకాకుండా సూర్య హీరోగా నటిస్తోన్న కంగువా చిత్రం విడుదలకు ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు సూచించింది.

అసలేం జరిగిందంటే..

గతంలో అర్జున్‌లాల్ సుందరదాస్ అనే వ్యక్తితో కలిసి నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.40 కోట్లతో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. అయితే  ప్రీ-ప్రొడక్షన్‌కి ఖర్చులకు గానూ స్టూడియో  గ్రీన్ నిర్మాణ సంస్థకు సుందర్‌దాస్‌ రూ.12.85 కోట్లు చెల్లించారు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి సుందర్‌దాస్‌ తప్పుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడంతో మిగిలిన రూ.10.35 కోట్ల కోసం సుందర్‌దాస్‌ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.

అయితే ఈ కేసు గురించి నిర్మాత కేఈ జ్ఞానవేలు మాట్లాడుతూ... మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడని తెలిపారు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. కానీ గ్రీన్ స్టూడియోస్ తమకు రూ.10.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కోర్టులో దావా వేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టినా ధర్మాసనం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమాల రిలీజ్‌కు ముందు కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
 

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)