Breaking News

హీరో విక్రమ్‌ ‘తంగలాన్‌’ ప్రయాణాన్ని ఊహించుకోలేను: మాళవిక మోహన్‌.

Published on Mon, 05/22/2023 - 09:19

తమిళ సినిమా: ముంబైలో చదివి,పెరిగిన మలయాళీ నటి మాళవిక మోహన్‌. తొలుత మాతృభాషలో నటిగా పరిచయమై ఆ తర్వాత కన్నడం, హిందీ, తమిళం అంటూ పాన్‌ ఇండియా నటిగా మారిపోయింది. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్‌ కథానాయకుడుగా నటించిన పేట చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అందులో నటుడు శశి కుమార్‌కు భార్యగా విలక్షణ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత మాస్టర్‌ చిత్రంలో విజయ్‌తోను, ధనుష్‌కు జంటగా మారన్‌ చిత్రంలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీ ప్రస్తుతం విక్రమ్‌ సరసన తంగలాన్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం చాలా కసరత్తులే చేసింది ముఖ్యంగా కర్రసాము విలువ విద్యలో శిక్షణ పొందింది. ఆ ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా అవి ట్రెండింగ్‌ అయ్యాయి.

(చదవండి: తెలుగులో నటించడానికి రెడీ:  దుషారా విజయన్‌)

పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న తంగలాన్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంది. అయితే ఇటీవల షూటింగ్‌లో విక్రమ్‌ గాయాలపాలు కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్‌ నిలిచిపోయింది. విక్రమ్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత తంగలాన్‌ చిత్ర షూటింగ్‌ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు పేర్కొన్నారు.

(చదవండి: కమల్‌ హాసన్‌ ఖాతాలో మరో అరుదైన అవార్డు )

కాగా ఈ చిత్రంలో విక్రం సరసన నటించిన అనుభవం గురించి నటి మాళవిక మోహన్‌ చెబుతూ..  తంగలాన్‌ చిత్రంకు సంబంధించినంత వరకు విక్రమ్‌ లేకపోతే  తను ఈ ప్రయణాన్ని ఊహించుకోలేనని పేర్కొంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన తనకు ఎంతగానో సహకరించేవారు అని చెప్పింది. ఆయన తనే కాకుండా తన చుట్టూ ఉన్న వారంతా బాగా నటించాలని కోరుకునే నటుడు అని చెప్పింది. అలా తమలోని నటనను బయటికి తీసి ఉత్సాహపరిచే వారిని పేర్కొంది. విక్రమ్‌ సెట్‌లో ఎప్పుడు చాలా జాలీగా ఉంటూ కామెడీ చేస్తూ వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తారని నటి మాళవిక మోహన్‌ చెప్పింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)