Breaking News

కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య

Published on Fri, 01/17/2025 - 16:09

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ తండేల్‌. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో చై మత్య్సకారుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య.. మత్య్సకారుల జీవితాల్ని దగ్గరి నుంచి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు. ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అని షూటింగ్‌ ప్రారంభంలో మత్య్సకారులకు మాటిచ్చాడట! అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.

చేపల పులుసు వండిన చై
కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టాడు. అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు, ఉప్పు, కారం దట్టించాడు. తర్వాత నూనె వేసి, కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు. మధ్యలో కాస్తంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు. చివర్లో కొత్తిమీర చల్లి.. చేపల పులుసు సిద్ధం చేశాడు. మత్య్సకారులకు ఆ చేపల పులసుతో భోజనం పెట్టాడు. తన చేతి వంట బాగుందా? అని అడగ్గా తిన్నవారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు.

ఏమీ అనుకోవద్దంటూ..
అయితే తన వంటపై తనే డౌట్‌ పడ్డ చై.. చేపల పులుసు వండటం ఇదే తొలిసారి. బాగోలేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతూ చెప్పాడు. మత్య్సకారులతో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే తండేల్‌ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

 

చదవండి: 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)