Breaking News

'తండేల్‌' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌

Published on Sat, 02/08/2025 - 09:34

బాక్సాఫీస్‌ వద్ద తండేల్‌ మొదటిరోజే భారీ కలెక్షన్స్‌ సాధించింది.  నాగచైతన్య, సాయి పల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్‌ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్‌ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్‌ టాక్‌ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. దీంతో ఫస్ట్‌ డే నాడు భారీ కలెక్షన్స్‌ రాబట్టింది.

తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ చిత్రంగా తండేల్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్‌ దాటేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ నెట్టింట భారీగా వైరల్‌ చేస్తున్నారు. విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బుక్‌మై షోలో మొదటిరోజే  సుమారు 2.5 లక్షలకు పైగా ‘తండేల్‌’ టికెట్స్ సేల్‌ అయ్యాయి. ఆ ట్రెండ్‌ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రతి గంటకు 10 వేల టికిట్లు అమ్ముడుపోతున్నాయి.  రాజుగా నాగచైతన్య, స‌త్య పాత్రలో సాయిపల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం, విజువల్స్‌ చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)