Breaking News

విజయ్‌ను డైరెక్ట్‌ చేసే లాస్ట్‌ ఛాన్స్‌ ఆ దర్శకుడికే..

Published on Tue, 07/04/2023 - 07:41

కోలీవుడ్‌లో వసూళ్ల రారాజు నటుడు విజయ్‌. ఈయన చిత్రం వస్తుందంటే ఇతర చిత్రాల నిర్మాతల్లో కలవరం. అభిమానుల్లో కోలాహలం కనిపిస్తాయి. ఆ స్థాయిలో స్టార్‌ డమ్‌ సంపాదించుకున్న దళపతి విజయ్‌ నటకు బ్రేక్‌ ఇస్తారా? ఇది జరిగే పనేనా? అంశం ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది.

(ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి)

కాగా విజయ్‌ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన 68వ చిత్రం అవుతుంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. దీన్ని విజయ్‌ 2024 మే నెలాఖరు కల్లా పూర్తి చేసి నటనకు బ్రేక్‌ ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. అంతేకాదు ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌ కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జోరందుకుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్‌ ఓటుకు నోటుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు గట్టిగానే హితబోధ చేశారు. కాగా 2025 ఏడాదంతా విజయ్‌ ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ సేవా కార్యక్రమాలు, రాజకీయ అంశాలపై పూర్తిగా దష్టి పెట్టనున్నట్లు టాక్‌. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్‌ చర్యలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ)

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)