Breaking News

నేడు 'విజయ్‌' తొలి బహిరంగ సభ.. ఎంతమంది రానున్నారంటే..?

Published on Sun, 10/27/2024 - 07:30

తమిళ సినీ రంగం నుంచి మరో అగ్రనటుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారే తరుణం ఆసన్నమైంది. విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి మహానాడు నేడు (అక్టోబర్‌ 27) జరగనుంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే నేతలందరూ విల్లుపురానికి చేరుకున్నారు. కాగా మహానాడులో విజయ్‌ ఏఏ అంశాలను ప్రస్తావిస్తారు.. ఎవరిని టార్గెట్‌ చేస్తారు.. సిద్ధాంతాలు ఏరకంగా ఉంటాయనే విషయం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సభ హైలెట్స్‌ ఇవే..

  • 5 నుంచి 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా .

  • వేదికపై విజయ్‌ ఎగుర వేసే పార్టీ జెండా ఐదేళ్ల పాటు ఎగిరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

  • చైన్నె – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీసాలై వద్ద 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి మహానాడు ఏర్పాట్లు.

  • సభా వేదిక చుట్టూ.. వేలునాచ్చియార్‌, కామరాజర్‌, పెరియార్‌, అంబేడ్కర్‌, తమిళ తల్లి, చోళ, చేర, పాండ్య రాజుల కటౌట్లను ఏర్పాటు చేయడం.

  • సభా ప్రాంగణంలో విజయ్‌ అభిమానులకు సమీపంలోకి వచ్చి పలకరించే విధంగా 800 మీటర్లకు ప్రత్యేకంగా ర్యాంప్‌ ఏర్పాటు.

  • వాహనాల పార్కింగ్‌ కోసం 207 ఎకరాల స్థలం కేటాయింపు.

  • చైన్నె నుంచి విక్రవాండి వరకు సుమారు 150 కి.మీ దూరంలో విజయ్‌ కటౌట్లు, పార్టీ జెండాలను తమిళగ వెట్రికళగం వర్గాలు ఏర్పాటు చేశాయి.

  • ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అభిమానులు, పార్టీ కేడర్‌ చేరుకునే విధంగా ప్లాన్‌.. సాయంత్రం 5 గంటలకు మహానాడు మొదలయ్యే రీతిలో షెడ్యూల్‌ సిద్ధం.

  • మహానాడు భద్రత విధులలో ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, 15 మంది ఏడీఎస్పీలు, 50 మంది డీఎస్పీలు సహా 6 వేల మంది పోలీసులు ఉన్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)