Breaking News

ఫ్యాన్స్ అత్యుత్సాహం.. స్టార్ హీరో కారు అద్దాలు ధ్వంసం!

Published on Tue, 03/19/2024 - 12:44

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అది కూడా కేరళలో తమ అభిమాన హీరో కారుపైనే. ప్రస్తుతం ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అలానే సదరు ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. దీంతో ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? విజయ్ కేరళలో ఏం చేస్తున్నాడు?

(ఇదీ చదవండి: మంచు లక్ష్మి కాళ్ల మీద పడి ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్)

'లియో' సినిమాతో ప్రేక్షకుల్ని గతేడాది పలకరించిన విజయ్.. ప్రస్తుతం 'ద గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే మూవీ చేస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కథతో ఈ చిత్ర షూటింగ్ కోసం వారం రోజుల పాటు టీమ్ అంతా కేరళ వెళ్లారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ దగ్గరకు వస్తున్నాడని తెలిసి, కేరళలోని విజయ్ ఫ్యాన్స్ ఒక్కచోటకు చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది.

విజయ్ వస్తున్నాడని తెలిసి వందలాది మంది ఫ్యాన్స్ ఎయిర్‌పోర్ట్ దగ్గరకు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి విజయ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో తోపులాట ఎక్కువ కావడంతో కారు డ్రైవర్ దగ్గర ఉండే అద్దం పగిలిపోయింది. అలానే చాలా చోట్ల కారుకి సొట్టలు కూడా పడ్డాయి. కాకపోతే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ కారుకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' విషయంలో బాధంతా వాళ్లదే: నిర్మాత నాగవంశీ)

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి