Breaking News

'రూ. 2 కోట్లు కూడా కలెక్ట్‌ చేయలేని హీరోకు రూ. 13 కోట్లు ఇచ్చారు'

Published on Sat, 06/07/2025 - 21:37

తెలుగు రాష్ట్రాల్లో సినిమా బంద్‌ అంశంపై నూతనంగా ఎన్నికైన  తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్   అధ్యక్షుడిగా సునీల్ నారంగ్‌, కార్యదర్శి శ్రీధర్‌ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలు తమకు దేవుళ్లు లాంటి వారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని పేర్కొన్నారు.  థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు కలిసి పెద్ద వివాధంగా మార్చారని, త్వరలోనే వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తామని కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. థియేటర్స్‌ బంద్‌ అనేది తమ నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రకటన ఫిల్మ్ ఛాంబర్ చేయలేదన్నారు.

పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని శ్రీధర్‌ వాపోయారు. ప్రస్తుతం ఒక్కో హీరో రెండేళ్లకో సినిమా చేయడం వల్ల సింగిల్  థియేటర్ల పరిస్థితి మనుగడ కష్టంగా తయారైందని ఆయన అన్నారు. హీరోలందరికీ స్టార్‌ హోదా  రావడానికి కారణం ఎవరు..? వారు ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక రకంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హీరోలు కూడా అని ఆయన అన్నారు.

రూ.10 లక్షలు రెమ్యునరేషన్‌ తీసుకునే ఒక హీరోకి తదుపరి సినిమా కోసం రూ.30 లక్షలు నిర్మాతలు ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఒక సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్స్‌ రూ. 2కోట్లు. కానీ, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని ఆయన వాపోయారు. అయితే, శ్రీధర్‌ చేసిన వ్యాఖ్యలు 'జాక్‌' సినిమా గురించి అంటూ నెటిజన్లు ఆపాదిస్తున్నారు. ఈ సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డ రూ. 13 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నారని, సినిమా డిజాస్టర్‌ కావడంతో ఆ చిత్ర నిర్మాతకు కొంత తిరిగిచ్చేశాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సినిమా పేరు చెప్పకపోవడంతో నెటిజన్లు మాత్రం వరుణ్‌ తేజ్‌, నితిన్ అంటూ ఎవరికితోచిన పేరు వారు చెప్పుకుంటూ పోతున్నారు.

అయితే,   అధ్యక్షుడు సునీల్ నారంగ్.. హీరోల రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడే హక్కు తమకు లేదని చెప్పుకొచ్చారు. కానీ, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేది తమ కోరిక అంటూ పేర్కొన్నారు. థియేటర్ల బంద్ వార్త  విన్న తర్వాత తాను కూడా ఆశ్చర్యానికి లోనయ్యా అన్నారు. థియేటర్లకు సంబంధించి ఆ నలుగురు అనే వారు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చాలామంది ఓనర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. సింగిల్‌ థియటర్స్‌ యాజమాన్యం కోరుతున్న పర్సంటేజ్ విధానం త్వరలోనే పరిష్కారం అవుతుందని  సునీల్ నారంగ్ చెప్పారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)