Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Fri, 06/07/2024 - 13:20

మరో క్రేజీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రీసెంట్‌గా మళ్లీ హీరోగా చేస్తూ హిట్ కొట్టిన సత్యం రాజేశ్ లేటెస్ట్ మూవీ 'టెనెంట్'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం.. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు గడవకముందే ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ 'టెనెంట్' ఓటీటీ రిలీజ్ సంగతేంటి? సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పుడు చూసేద్దాం.

(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్.. గత కొన్నాళ్లలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కానీ 'పొలిమేర' మూవీలో లీడ్ రోల్ చేసి కమ్ బ్యాక్ ఇచ్చాడు. దీని సీక్వెల్ 'పొలిమేర 2'తోనూ మరో హిట్ అందుకున్నాడు. దీంతో ఇతడు హీరోగా పలు సినిమాలు తీస్తున్నారు. వీటిలో ఒకటే 'టెనెంట్'. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాని ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు.

'టెనెంట్' విషయానికొస్తే.. గౌతమ్, సంధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ల జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంధ్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందోనని గౌతమ్ తెలుసుకునేలోపే ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపిస్తుంది. అప్పుడే వీళ్లుంటున్న అపార్ట్‌మెంట్‌ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకి ఆ‍త్మహత్య చేసుకుంటాడు. అసలు సంధ్యది హత్య? ఆత్మహత్య? గౌతమే ఆమెని చంపేశాడా? చనిపోయిన కుర్రాడు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: 'లవ్ మౌళి' సినిమా రివ్యూ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)