Breaking News

వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?

Published on Mon, 02/09/2026 - 03:10

ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు వస్తే అందులో మూడు హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'.. ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని నిర్మాతలు ప్రకటించుకున్నారు. తెలుగులో మాత్రమే తీసిన ఓ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో వచ్చే పండగకి ఇప్పటినుంచే కర్చీఫులు వేసేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోలు నలుగురు రాబోతున్నట్లు హింట్స్ ఇచ్చేస్తున్నారు.

అధికారికంగా చూసుకుంటే నాగార్జున.. సినిమాతో పాటు డేట్ కూడా ప్రకటించేశారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు మూడో పార్ట్ వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 15న థియేటర్లలోకి రాబోతుందని అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి భాగం 2016లో రాగా అద్భుతమైన హిట్ అయింది. 2022లో వచ్చిన రెండో పార్ట్ కూడా సక్సెస్ అందుకుంది. 2027 సంక్రాంతికి ఇప్పుడు మూడో భాగం రానుంది.

ఈసారి చిరంజీవితో బ్లాక్‌బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో వస్తానని ఇదివరకే చెప్పేశాడు. అయితే అది వెంకటేశ్‌తోనే ఉండబోతోందని టాక్. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని మాట్లాడుకుంటున్నారు. వెంకీ-ఫహాద్ తోడళ్లులుగా కనిపించబోతున్నారని టాక్. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అనిల్-వెంకకి మరో హిట్ పక్కా.

ఈసారి పండగకు వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. వచ్చే సంక్రాంతికి కూడా రావాలని అనుకుంటున్నారట. 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ దర్శకత్వంలో మరోసారి చిరు పనిచేయబోతున్నారు. ఇదివరకే ప్రకటన వచ్చింది. కూతురి సెంటిమెంట్ నేపథ్యంగా సాగే యాక్షన్ స్టోరీ ఇదని తెలుస్తోంది. దీన్ని పండగకే టార్గెట్ చేసుకుని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.

మరోవైపు బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తొలుత పీరియాడికల్ స్టోరీ అనుకున్నారు. కానీ బడ్జెట్ సమస్యల వల్ల దాన్ని పక్కనబెట్టేసి ఓ యాక్షన్ మూవీ తీయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుని కూడా వచ్చే సంక్రాంతి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తోంది.

గతంలో చిరు-బాలకృష్ణ, వెంకీ-నాగ్, నాగ్-చిరు.. సంక్రాంతికి పోటీపడిన సందర్భాలు ఉన్నాయి గానీ నలుగురు ఒకేసారి రాలేదు. కానీ వచ్చే సంక్రాంతి మాత్రం ఈ షాకింగ్ పోటీకి వేదిక కానుందని అంటున్నారు.వీళ్లతో పాటు పవన్ కల్యాణ్-సురేందర్ రెడ్డి, శర్వానంద్-శ్రీనువైట్ల, తేజ సజ్జా 'జాంబీ రెడ్డి 2' సినిమాలని కూడా ఈ పండగకే థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి వీళ్ళలో ఫైనల్ అయ్యేది ఎవరో చూడాలి?

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు