Breaking News

‘థియేటర్స్‌ బంద్‌’పై ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

Published on Sat, 05/24/2025 - 14:10

జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనేది అవాస్తవం అని..ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి  దామోదర ప్రసాద్‌ కోరారు. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ..జూన్‌ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ ఏమీ ఉండదని చెప్పారు.

 ‘చర్చలు జరగకపోతే, జూన్‌ 1 నుంచి థియేటర్స్‌ బంద్‌ చేస్తామని చెప్పారు కానీ..దాన్ని కొంతమంది మరోలా ప్రచారం చేశారు. జూన్‌ 1 నుంచి థియేటర్స్‌ మూసివేస్తారనే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అలాంటిదేమి జరగడం లేదు. సమస్యలను పరిష్కరించుకోవడానికి మూడు సెక్టర్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నాం.నిర్ణిత సమయంలోగా మా సమస్యలను పరిష్కరించుకుంటాం. 30న ఈసీ సమావేశమై కమిటీ  ఎవరనేది నిర్ణయిస్తాం. 

థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది.కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్‌లను బంద్‌ చేస్తున్నామనడం సరికాదు.  చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్‌ మ్యాప్‌ ఏంటనేది నిర్ణయిస్తాం’ అని దామోదర ప్రసాద్‌ అన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)