Breaking News

నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. రేసులో ఎవరున్నారంటే

Published on Sun, 07/28/2024 - 06:53

టాలీవుడ్‌లో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల సందడి మొదలైంది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్‌ రాజు పదవి కాలం ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం నేడు (జులై 28) ఉదయం 11 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. అయితే, ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌కు చెందిన సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. గతేడాది నిర్మాతల సెక్టార్‌ నుంచి  సి.కల్యాణ్‌ ఫ్యానల్‌పై 17 ఓట్ల తేడాతో దిల్‌ రాజు గెలుపొందారు.

టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవి రేసులో ఈసారి డిస్ట్రిబ్యూటర్‌ విభాగం నుంచి ఠాగూర్‌ మధు (నెల్లూరు), భరత్‌ భూషణ్‌ (విశాఖపట్టణం) బరిలో ఉన్నారు.  బైలా ప్రకారం ఒక ఉపాధ్యక్ష పదవిని నిర్మాతల నుంచి ఎన్నుకోవాల్సివుంది. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీలో ఉన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకుంటారు.

వీరిలో అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని  48 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. 25 ఓట్ల మెజార్టీ ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నిక అయినట్లు ప్రకటిస్తారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఓటింగ్‌ జరుగుతుంది.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)