Breaking News

చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె.. కొత్త వారి కోసం నోటిఫికేషన్‌

Published on Tue, 08/05/2025 - 10:09

టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగడంతో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) (Telugu Film Chamber of Commerce) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సమ్మెలోకి వెళ్లింది. దీంతో నిర్మాతలు కూడా కార్మికులకు అంత మొత్తం చెల్లించలేమని తేల్చేశారు. బయట ఉన్న ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఇప్పటికే వర్కర్లకు ఎక్కువ చెల్లిస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు.  

కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తగ్గకపోవడంతో నిర్మాతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్మాతలు కొత్త మార్గాలు అన్వేషించారు. ఇక నుంచి యూనియన్లతో సంబంధం లేకుండా నిర్మాతలే ఒక నోటిఫికేషన్విడుదల చేసి ఆసక్తికలిగిన కొత్తవారిని వర్క్లోకి తీసుకోవాలని అనుకున్నారు. ఎంపిక అయిన వారిని పనికి తగినట్లు ట్రైయినింగ్‌ ఇచ్చి ఉద్యోగం కల్పించాలని చూస్తున్నారు

మొత్తం 22 విభాగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్విడుదల చేశారు. అందులో ఎడిటింగ్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌, ప్రొడక్షన్‌, ఆర్ట్‌ వర్క్‌, కొరియోగ్రఫీ వంటివి కూడా ఉన్నాయి. ఆసక్తి వున్న వారు ధరఖాస్తు Atfpg.com చేసుకోవచ్చు. నిర్మాత అశ్వీనిదత్కూడా నోటిఫికేషన్లింక్నే షేర్చేశారు. మీలో ఎవరైనా ఔత్సాహిక నిపుణులు, కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యత్వం కోసం రూ.లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నైపుణ్యం ఉన్న కార్మికులకు పని కల్పించడమే తమ ధ్యేయమని వారు పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)