Breaking News

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం.. స్పందించిన జానీ మాస్టర్‌

Published on Mon, 12/09/2024 - 12:12

లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి, ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన జానీ మాస్టర్‌కి ఊహించని షాక్ తగిలిందంటూ వార్తలు వచ్చాయి. ఆయనను డ్యాన్స్‌ అసోసియేషన్ నుంచి  తొలగించారని సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా జానీ మాస్టర్‌ తన సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్‌ అయ్యారు.

మొన్నటివరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చారు. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో.. ఇతడి పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాశ్ విజయం సాధించారు. 5వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023లో అధ్యక్షుడిగా ఎన్నికైన  జానీ.. తన పదవీ కాలం 2025 వరకు ఉంది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా అసోషియేషన్‌లో ఎలక్షన్లు నిర్వహించడంపై ఆయన తప్పుబట్టారు

వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: జానీ
తనను అసోసియేషన్ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని జానీ మాస్టర్‌ తెలిపారు. సోషల్‌మీడియాలో కావాలనే ఎవరో ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారని ఇలా చెప్పారు. 'నన్ను ఏ యూనియన్‌ నుంచి తొలగించలేదు. నేను డ్యాన్సర్‌ యూనియన్‌లో మెంబర్‌. అందులో నుంచి శాశ్వితంగా ఎవర్నీ తొలగించలేరు.  నిన్న జరిగిన ఎన్నికలపై నేను ఫైట్‌ చేస్తాను. నా పదవీ కాలం ఇంకా ఉంది. కొందరు అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకున్నారు. వారికి ఆ హక్కు లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్‌ ఛేంజర్‌ నుంచి  ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.' అని జానీ అన్నారు.

డ్యాన్స్‌ అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. శంకర్‌పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 15 ఎకరాలు భూమి కొనుగోలు సమయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని. ఆ స్కామ్ వివరాలను జానీ మాస్టర్‌ బయటకు తీయడం వల్లే జానీ మాస్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయని తెలుస్తోంది. డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో కూడా భారీగా వసూళ్లకు పాల్పిడినట్లు జానీ ఆరోపించడంతో తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)