Breaking News

తెలుగు స్టార్ హీరోల పిల్లలు.. భవిష్యత్ ప్లాన్స్ ఏంటి?

Published on Fri, 11/14/2025 - 07:15

ప్రస్తుత జనరేషన్ తెలుగు హీరోల్లో చాలామంది ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తండ్రి బాధ్యతల్ని అంతే చక్కగా పూర్తి చేస్తున్నారు. తమ కొడుకు లేదా కూతురికి ఏం కావాలంటే అది చేస్తున్నారు. దీంతో హీరోల కొడుకులు హీరోలే కావాలని కాకుండా పలు రంగాల్లో తమ ప్రతిభ చూపించే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకీ టాలీవుడ్ యంగ్ హీరోల వారసులు ఏం చేస్తున్నారు? వాళ్ల భవిష్యత్ ప్లాన్స్ ఏంటి? చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) సందర్భంగా మీకోసం.

మహేశ్ బాబు విషయానికొస్తే కొడుకు గౌతమ్, కూతురు సితార.. ఇదివరకే తన సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించారు. గౌతమ్‌కి స్పోర్ట్స్ స్టార్‌గా ఎదగాలని కల ఉందట. మరి అందుకు తగ్గ ప్రిపరేషన్స్‌లో ఉన్నాడో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికైతే విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార అయితే టీనేజీలోకి రాకముందు నుంచి నటి కావాలని తెగ ఇంట్రెస్ట్ చూపించింది. క్లాసికల్ డ్యాన్స్ ఇప్పటికే నేర్చుకుంది. జ్యూవెల్లరీ షాప్ యాడ్ కూడా చేసేసింది. చూస్తుంటే అటు గౌతమ్, ఇటు సితార ఇద్దరూ కూడా నటులే అయ్యేలా కనిపిస్తున్నారు.

అల్లు అర్జున్ విషయానికొస్తే.. కొడుకు అయాన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తండ్రిలా నటుడు అవుతాడా లేదా అనేది స్తుతానికి సస్పెన్స్. కూతురు అర్హ మాత్రం కచ్చితంగా హీరోయిన్ అవుతుంది. గతంలోనే సమంత 'శాకుంతలం'లో బాలనటిగా చేసింది. చూస్తుంటే పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది.

ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్.. తండ్రిలా హీరో కావాలని అనుకోవట్లేదట. దర్శకుడిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడట. రవితేజ కొడుకు మహాధన్.. గతంలో 'రాజా ది గ్రేట్' చిత్రంలో తండ్రి చిన్నప్పటి పాత్రలో బాలనటుడిగా చేశాడు. కానీ ఇతడి మనసులో మాత్రం దర్శకత్వం ఆలోచనే ఉందట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు మోక్షద అయితే అటు నటన ఇటు దర్శకత్వం లాంటివి కాకుండా నిర్మాత అయ్యే ఆలోచనలో ఉందట. ఆల్రెడీ అదే పనిలో ఉందని కూడా తెలుస్తోంది.

నాని కొడుకు అర్జున్.. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. పియానో ప్లే చేస్తున్న వీడియోని నాని భార్య అంజన.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. మరి సంగీతం వైపు వస్తాడా లేదంటే తండ్రిలా యాక్టర్ అవుతానని అంటాడా అనేది తెలియాలంటే ఇంకొన్నేళ్లు ఆగాలి. మంచు విష్ణు వారసులు ఇప్పటికే స్క్రీన్ పై కనిపించేశారు. కుమార్తెలు అరియానా, వివియానా.. కొడుకు అవ్రామ్.. 'కన్నప్ప' మూవీలో యాక్ట్ చేశారు. చూస్తుంటే విష్ణు తర్వాత తరాన్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడనమాట.

తెలుగు దర్శకుల్లో సుకుమార్ కూతురు సుకృతి.. ఇప్పటికే 'గాంధీ తాత చెట్టు' మూవీలో నటించింది. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. కానీ ఈమెకు మాత్రం మ్యూజిక్ టీచర్ కావాలని ఉందట. డైరెక్టర్ త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి మనోజ్.. ఇప్పటికే దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. ప్రభాస్ 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడట.

వీళ్లందరినీ చూస్తుంటే రాబోయే తరంలోనూ నటీనటులతో పాటు మ్యూజిక్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరెవరు ఏమేమవుతారనేది రాబోయే కొన్నేళ్లలో కాలమే నిర్ణయిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)