Breaking News

టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

Published on Fri, 01/09/2026 - 15:45

ప్రభాస్‌- మారుతి కాంబినేషన్‌ సినిమా 'రాజాసాబ్‌' జనవరి 9న విడుదలైంది. అయితే, తెలంగాణలో టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారుల తీరును తప్పబట్టింది. న్యాయస్థానం చెప్పినా సరే పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయింది. కొద్దిరోజుల క్రితం టికెట్‌ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా కూడా మళ్లీ ఎందుకు పెంచారంటూ  కోర్టు ప్రశ్నించింది.

టికెట్‌ ధరల పెంపు కోసం ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రబాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారికి భారీ ఊరట లభించింది.  టికెట్‌ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.  అయితే, ఇప్పుడు టికెట్‌ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాశంగా మారింది.

తెలంగాణలో ‘ది రాజాసాబ్‌’ సినిమా టికెట్‌ ధరలను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచారు.  జనవరి 9 నుంచి ఈ నెల 11 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, 12 నుంచి 18వ తేదీ వరకు  ఆ ధరలను సడలించింది. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. టికెట్‌ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో తెలిపింది.
సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
 

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)