Breaking News

రాజాసాబ్‌, చిరంజీవి.. తెలంగాణలో జీవో తెచ్చేదెవరు?

Published on Sat, 01/03/2026 - 13:08

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద వారంలో సంక్రాంతి సందడి ప్రారంభం కానుంది. రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్‌ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్‌ ట్రైలర్‌ రావడంతో ఆ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. జనవరి 4న మన శంకర వరప్రసాద్‌ గారు ట్రైలర్‌తో వస్తున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ఎటూ బజ్‌ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాల టికెట్‌ ధరల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్‌ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్‌ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు ఛాన్స్‌ ఉంది. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి, ప్రభాస్‌ సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్‌లలో ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కదుపుతారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. రీసెంట్‌గా అఖండ-2 మూవీకి టికెట్‌ ధరలు పెంచితే తనకు తెలియకుండానే అధికారులు జీవో ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఎవరూ టికెట్ రేట్ల పెంపు కోసం తమ ప్రభుత్వం వద్దకు రావద్దని మీడియా ద్వారా సినిమా వాళ్లకు తెలిపారు. 

అలాంటిది ఇప్పుడు టికెట్‌ రేట్ల కోసం ప్రభుత్వంతో చర్చలు ఎవరు జరుపుతారు అనేది తేలాల్సి ఉంది. రాజా సాబ్‌ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, చిరంజీవిలలో ఎవరైనా రంగంలోకి దిగుతారా..? మంత్రి తన మనసు మార్చకుని వెసులుబాటు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు అనేది లేకుండా ఈ రెండు సినిమాలను విడుదల చేస్తే.. బ్రేక్ ఈవెన్ దాటడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే, మిగతా సినిమాలకు ఈ సమస్య లేదని చెప్పాలి.  అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై  ఒక ప్రకటన చేశారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిపారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)