Breaking News

అల్లు అర్జున్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు: స్టార్‌ డైరెక్టర్‌

Published on Sat, 12/14/2024 - 17:17

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై ప్రముఖ దర్శకులు రామ్‌ గోపాల్‌వర్మ మరోసారి కామెంట్‌ చేశారు. సంధ్య థియేటర్‌ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వర్మ తనదైన రీతిలో ఎక్స్‌ వేదికగా రియాక్ట్‌ అయ్యారు. 'అల్లు అర్జున్‌ అరెస్ట్‌ విషయంలో అధికారులకు నా 4 ప్రశ్నలు' అంటూ అందరినీ ఆలోచింపచేసిన ఆయన మరోసారి  తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్‌ చేశారు.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తర్వాత కేంద్రమంత్రుల నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్ధతుగా నిలిచారు. ఇప్పటికే బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడిన  ఆర్జీవి మరోసారి ఇలా ట్వీట్‌ చేశారు. ' తెలంగాణకు చెందిన అల్లు అర్జున్‌ భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీని అందించి, రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్‌ను జైలుకు పంపి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది.' అంటూ తనదైన స్టైల్లో ట్వీట్‌ చేశారు.

నేషనల్‌ అవార్డ్‌తో తెలుగు సినిమా కీర్తిని పాన్‌ ఇండియా రేంజ్‌కు అల్లు అర్జున్‌ తీసుకెళ్లాడని తెలిసిందే. ఇన్నేళ్ల తెలుగు ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్‌ అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు మన సత్తా ఏంటో చూపించాడు. అంతటి స్టార్‌ ఇమేజ్‌ ఉన్న హీరో అరెస్ట్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమ మొత్తం షాక్‌ అయింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)