తెలంగాణలో ‘పుష్ప 2’ టికెట్‌ ధరల పెంపు.. ఒక్కో టికెట్‌ ధర ఎంతంటే..?

Published on Sat, 11/30/2024 - 14:44

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్‌ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు అర్ధరాత్రి 1 షోల‌కు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వులో పేర్కొంది.  

పుష్ప 2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్‌ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇ​​క డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 చొప్పున పెంచుకునేందుకు మేకర్స్‌కి వెసులుబాటు కల్పించింది. 

(చదవండి: మెగా హీరో కొత్త సినిమా.. ఓటీటీలోకి ఇంత త్వరగానా?)

ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్‌ -బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా. మూడేళ్ల క్రింద విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌ ఇది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్‌ ఫాజిల్‌ మరో కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Pushpa 2 Movie: ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు..

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)