Breaking News

ఇన్‌స్టాతో పాపులర్‌.. ఫోక్‌ సింగర్‌ 'శృతి' ఆత్మహత్య

Published on Thu, 12/19/2024 - 09:26

ఇన్‌స్టాగ్రామ్‌తో సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్‌ సింగర్‌ శృతి ఆత్మహత్యకు పాల్పడటం ఆమె ఫాలోవర్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఎక్కువగా జానపదాలు పాడుతూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది. జీవితంలో పెద్ద సింగర్ కావాలని ఎన్నో కలలు కన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా సింగర్‌ శృతి తప్పకుండా కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు కూడా షాక్‌ అయ్యారు.

ఇన్‌స్టాగ్రామ్‌తో పరిచయమై.. మూడు ముళ్లతో ఒకటై.. పట్టుమని నెల గడవకముందే నవ వధువు సింగర్‌ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి, సత్యమ్మ దంపతుల కుమారుడు ఎర్ర దయాకర్‌ హైదరాబాద్‌లో క్యాబ్‌ నడపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి శ్యామల, రమేశ్‌ కుతూరు, ఫోక్‌ సింగర్‌(యూట్యూబ్‌) శృతి (26) ఇన్‌స్టాగ్రామ్‌లో పేరడి పాటలతో  ఫేమస్‌ అయ్యింది. 

ఇన్‌స్టాగ్రామ్‌ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడి ప్రేమపెళ్లి వరకు వచ్చింది. ఇద్దరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్‌ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు హాజరు కాలేదు. నవ దంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు. బుధవారం గ్రామంలోనే దయాకర్‌ వాళ్ల కులానికి చెందిన వారి దశదినకర్మకి తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్‌ ఇంటికి రాగా ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు, శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నాలుగు నెలల గర్భిణి
ప్రస్తుతం శృతి నాలుగు నెలల గర్భిణి కాగా ఇంటి వద్దనే ఉంటుంది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వరకట్నం కోసమే శృతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఇరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు సముదాయించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)