Breaking News

తెలుగమ్మాయి హీరోయిన్‌గా తారకేశ్వరి ట్రైలర్‌ చూశారా?

Published on Mon, 01/27/2025 - 17:36

 శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ మూవీ 'తారకేశ్వరి'. శ్రీ శివ సాయి ఫిలిం బ్యాన‌ర్‌లో డైరెక్ట‌ర్ వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఘ‌నంగా జరిగింది. మూవీ పోస్టర్‌ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ట్రైలర్‌ బాగుంది
ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. 'తారకేశ్వరి' మూవీ ట్రైల‌ర్ చాలా బాగా ఉంది. ఇది మంచికి, చెడుకు జరిగే పోరాటాన్ని చక్కగా చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి సినిమాల‌ను అంద‌రూ ఆద‌రించాలి. ఇందులో తెలుగు హీరోయిన్లు ఉన్నారు. తెలుగు వారికే డైరెక్ట‌ర్ వెంకట్ రెడ్డి గారు అవ‌కాశం ఇవ్వ‌డం అభినంద‌నీయం" అన్నారు.  

పాన్ ఇండియా స్థాయిలో..
హీరో శ్రీకర్ మాట్లాడుతూ.. "తెలుగు ఇండ‌స్ట్రీ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సంపాదిస్తుండటం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. డైరెక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డిగారు ఎంతో శ్ర‌మించి అంద‌రికి న‌చ్చే విధంగా సినిమాను తెర‌కెక్కించారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని తెలిపారు. హీరోయిన్ అనుష మాట్లాడుతూ.. "నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు. దూర‌పు కొండ‌లు నునుపు.. ద‌గ్గ‌రికి వెళితే గ‌రుకు.. తెలుగమ్మాయిల‌కు అవకాశం ఇస్తున్న‌ ఇలాంటి సినిమాల‌ను ఆద‌రించండి" అని అన్నారు. 

ట్రైలర్‌లో కనిపిస్తోంది
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "హీరో శ్రీకర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారి టాలెంట్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది" అన్నారు. డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. "మా టీమ్‌ సభ్యులందరి కృషి వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించాలి. ప్రేక్ష‌కుల న‌మ్మ‌కాన్ని మేం నిల‌బెట్టే విధంగా సినిమా తెర‌కెక్కించాము. త్వ‌ర‌లోనే ఆడియో, ప్రీరిలీజ్‌ ఫంక్ష‌న్‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నాం" అని తెలిపారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)