Breaking News

ఎన్నో పోరాటాలు, మన లైఫ్‌ అంత సాఫీగా ఏం సాగలేదు: అలేఖ్య

Published on Fri, 02/24/2023 - 19:01

జీవితాంతం తోడుండాల్సిన భర్త అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఏ భార్య తట్టుకుంటుంది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ మహిళ మనసు ఎంత తల్లడిల్లుతుంది? భర్తే సర్వస్వమనుకున్న అలేఖ్యా రెడ్డిని నందమూరి తారకరత్న అకాల మరణం అశనిపాతంలా తాకింది. తను లేని జీవితాన్ని ఊహించుకోలేక కుమిలికుమిలి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. తాజాగా భర్తపై ఉన్న ప్రేమను బయటపెడుతూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది అలేఖ్య.

'జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్‌ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్‌ నాన్నా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న చేయి పట్టుకున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో షేర్‌ చేసింది. దీనిపై అలేఖ్య స్నేహితురాలు స్పందిస్తూ.. 'మీరెన్ని కష్టాలు పడ్డారో అతి కొద్దిమందికే తెలుసు. ఎంత పోరాడాలో అంతవరకు పోరాడారు. కానీ ఆ దేవుడు కొన్నిసార్లు దయ లేనివాడిగా వ్యవహరిస్తాడు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. ఎల్లప్పుడూ నీవెంటే ఉంటాను అ‍ల్లూ' అని రాసుకొచ్చింది. మిగతా నెటిజన్లు సైతం 'మేమంతా మీకున్నాం అక్కా, ధైర్యంగా ఉండండి' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: శ్రీదేవి లవ్‌ స్టోరీ తెలుసా?

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)