Breaking News

800 చీరలు, 50 కిలోల జ్యువెలరీతో బిగ్‌బాస్‌లోకి.. ఎవరీ బ్యూటీ?

Published on Sun, 08/31/2025 - 17:50

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు.. అక్కడేం చేయాలి? ఎలా సిద్ధంగా ఉండాలి? అవతలివారిని ఎలా ఢీకొట్టాలి? మానసికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఒక్కరు మాత్రం అవన్నీ పక్కనపెట్టి ఎలా రెడీ అవాలి? తన రాయల్‌ లైఫ్‌ను ప్రజలకు ఎలా చూపించాలి? అన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఆవిడే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ తాన్య మిట్టల్‌ (Tanya Mittal).

50 కిలోల నగలు
ఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో పాల్గొంది. ఈమె బిగ్‌బాస్‌ హౌస్‌కి ఏకంగా 800 చీరలు తీసుకెళ్లింది. అంతే కాదు, 50 కిలోల నగలను సైతం పట్టుకెళ్లిందట! ఇంత ఆర్భాటం ఎందుకన్న ప్రశ్నకు.. నా లగ్జరీలను నేనెందుకు వదిలేసుకోవాలి? నా చీరలు, నగలు అన్నీ నాతోపాటే తీసుకెళ్తా.. రోజుకు మూడు చీరలైనా కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అని షోకి వెళ్లడానికి ముందే చెప్పింది. వెండి వస్తువులను కూడా వెంట తీసుకెళ్లింది. ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్‌ తాన్యకు మాత్రమే దక్కడం గమనార్హం!

ఎవరీ తాన్య?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2000వ సంవత్సరంలో తాన్య మిట్టల్‌ జన్మించింది. 19 ఏళ్ల వయసులో కేవలం రూ.500తో 'హ్యాండ్‌మేడ్‌ లవ్‌ బై తాన్య' పేరిట హ్యాండ్‌బ్యాగ్‌, నగల బిజినెస్‌ ప్రారంభించింది. తర్వాత ఇందులో చీరలు అమ్మడం కూడా మొదలుపెట్టింది. 2018లో మిస్‌ ఆసియా టూరిజం యూనివర్స్‌ టైటిల్‌ గెలిచింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్‌ ఫాలోవర్లున్నారు. బిజినెస్‌, యాడ్స్‌ ద్వారా నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది.

 

 

చదవండి: మా ఇంట్లో ఎవరూ బీఫ్‌ తినరు: సల్మాన్‌ ఖాన్‌ తండ్రి

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)