Breaking News

సిగరెట్‌, గంజాయి తాగడం.. ఇలా చాలా అలవాట్లుండేవి: తనికెళ్ల భరణి

Published on Sat, 08/26/2023 - 10:45

నాన్న ఎందుకో వెనకబడ్డాడు.. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మకంటే నాన్న చాలా వెనుకబడ్డాడు.. ఆ మధ్య నటుడు తనికెళ్ల భరణి ఈ కవిత చదివి వినిపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పట్లో ఈ వీడియోను చూసి కంటతడి పెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా తన తండ్రిని తలుచుకుని మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు తనికెళ్ల భరణి. ఓ ఇంటర్వ్యూలో ఆయన తండ్రితో తనకున్న అనుబంధాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.

చెప్పులు కొనిస్తాడనుకుంటే..
ఏడో తరగతి చదువుకునే వరకు నా కాలికి చెప్పుల్లేవు. ఓసారి రోడ్డుమీద నడుస్తుండగా కాలిన సిగరెట్‌ మీద కావాలని కాలేసి అమ్మా అని అరిచాను. మా నాన్న వెంటనే అటూఇటు చూసి చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి నాకో జత కొనిస్తాడని అలా చేశాను. కానీ మా నాన్న చూసుకుని నడవలేవా? అని ఒక్కటిచ్చాడు. ఒకసారైతే నేను చేసే పనులు చూసి చెట్టుకు కట్టేసి కొట్టాడు.

వంద రూపాయల కోసం బూతులు..
మా నాన్న లాల్చీలో నుంచి రెండు రూపాయలు అలా కొట్టేసేవాడిని. ఓసారి ఆయన జేబులో నుంచి వంద రూపాయలు కొట్టేశాను. రాత్రి నేను అన్నం తింటుండగా వచ్చి.. వాడికి పప్పు, నెయ్యి ఎక్కువ వేయి, మనింట్లో భోజనం చేయడం ఇదే చివరిసారి కదా.. రేపటినుంచి జైల్లోనే కదా ఉండేది అని అమ్మతో అన్నాడు. వంద రూపాయలు కొట్టేస్తావా.. అని బూతులు తిట్టాడు. ఎప్పుడైనా నేను మా నాన్న జేబులో వెయ్యి రూపాయలు పెడితే ఎందుకనేవాడు. చిన్నప్పుడు కొట్టేసిన డబ్బులకు వడ్డీ అని చెప్పేవాడిని.

చెడు అలవాట్లు.. నాన్న ఎంత బాధపడ్డాడో
అప్పట్లో సిగరెట్స్‌ కాల్చేవాడిని. ధూమపానం మానేసిన నాన్న ఓసారి నా జేబులో నుంచి సిగరెట్‌ కొట్టేసి కాల్చాడు. అయితే ఒకానొక సమయంలో నాన్న నా గురించి చాలా బాధపడ్డాడు. అప్పుడు నాకు సిగరెట్‌ తాగడం, గంజాయి తాగడం.. ఇలా ఊహించనన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. నన్ను కొట్టాడు.. కానీ ఆయన మనసులో ఎంత బాధపడ్డాడో!' అని చెప్తూ ఏడ్చేశాడు తనికెళ్ల భరణి.

చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. కావాలనే ఇండస్ట్రీకి దూరం చేశారు

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)