వాళ్లు కేవలం అమ్మాయిల కోసమే సినిమాలు తీస్తున్నారు: తమ్మారెడ్డి

Published on Sat, 01/31/2026 - 19:09

ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని మెగస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను సింగర్‌ చిన్మయి విభేదించిన విషయం తెలిసిందే.. సినిమాలో ఛాన్స్‌ రావాలంటే తమ శరీరం అప్పగించాల్సిందేనని ఆమె ఓపెన్‌గానే చెప్పారు. చిరు జనరేషన్‌లో కనిపించిన పరిస్థితిలు ఇప్పుడు లేవని ఆమె అన్నారు. అందుకే మెగాస్టార్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటారని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇలా అన్నారు. 'పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. అయితే, అదీ వారిద్దరి అంగీకారంతోనే కొనసాగుతుంది. ఈ రకంగా చూస్తే చిరంజీవి చెప్పింది కొన్ని సందర్భాల్లో నిజమే. ఆయన చేసిన వ్యాఖ్యలను నేను తప్పబట్టను. కానీ, నా అభిప్రాయం ప్రకారం క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. అయితే, టాలెంట్‌ ఉంటే ఏ అమ్మాయి కూడా  ఇబ్బందులు పడదని చెప్పగలను.  సింగర్‌ చిన్మయి చేసిన వ్యాఖ్యలు కూడా నిజమే.. 

ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏడాది 200 పైగా సినిమాలు వస్తున్నాయి.  అందులో కొందరు ఎందుకు సినిమాలు తీస్తున్నారో వాళ్లకే తెలియదు. కేవలం అమ్మాయిలను లోబర్చుకునేందుకే కొందరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ, సీరియస్‌గా సినిమాలు తీసే పెద్ద దర్శకులు, నటులు, నిర్మాతలు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. లైంగిక వేధింపులను ఎదిరించినందుకు సింగర్‌ చిన్మయిని నిషేధించారు. ఆమె ఎవరికీ తల వంచలేదు. ఛాన్స్‌లు ఇవ్వకున్నా సరే ఆమె  ఎవరికీ లొంగలేదు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. చిరంజీవి వంటి వారు  క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని చెప్పడం వెనుక ప్రధాన కారణం టాలెంట్‌ ఉన్న వాళ్లు ధైర్యంగా ముందుకు రావాలనే చెప్పారనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)